కవితాంజలి

06 September 2008

ఏడకెళ్ళిపొతావే .. నా ప్రాణదీపమా..

కళ్ళతోటె నీవు
కధలు సెపుతావుంటే
మనసులోని బాధ
రివ్వునా పోయింది ..


ఎన్నాళ్ళకెన్నాళ్ళ కొచ్చినావు నీవు...
నా బాధ తీర్చంగ ఎతెంచినావు ..
నన్ను అక్కున చేర్చి నిదుర పుచ్చుతవుంటే..
నీ కంట జారిన కన్నీరు సెప్పింది
నీ మదిలో దాగున్న నా ప్రేమ గాధ ...


ఎల్లి పోతానంటు పయనమయ్యాక
కళ్ళలోనా నీ మనసు దాసలేనంటు
జలజలా రాలాయి కన్నీటి సుక్కలు
మనసుతోడా నిను సదవలేననుకొంటివ

ఏడకెళ్ళిపొతావే .. నా ప్రాణదీపమా..

posted by dpbandi at 10:08 PM 0 comments

నా పాటకు పల్లవి నీవు

నా పాటకు పల్లవి నీవు
ఈ హృదయానికి ప్రాణం నీవు
చిరుగాలికి రేగే నీ ముంగురులు
నా భావుకత్వపు ప్రేరణలు
ఎక్కడ నీవు ప్రియతమా....
ఇంకెక్కడ వెతకను నీ కోసం..!

నా అశలు కలలూ అన్నీ నీవు
నా చిరులోకపు గమనం నీవు !

నా మనసులొన నా కలలలోన
కంటిలోన కన్నీటిలోన
నీ రూపేలే ఓ నా చెలియా !

నా కలవై చెలివై
నా వూహల పల్లకివై
కలల రాణివై ,కవితా మూర్తివై
కరుణించవ నీ ప్రియ నేస్తాన్ని
అధిరోహించవ ఈ నా హృదయన్ని !!


- ( 4 ఫిబ్రవరి 1998 , వరంగల్లు)
posted by dpbandi at 9:52 PM 0 comments

నా చెలి తప్ప ...

కృష్ణశాస్త్రి కావ్యనాయికలు
చలం స్త్రీల కేరింతలు
శ్రీశ్రీ కార్మికుల ఆర్తనాదాలు
విశ్వనాధ వేయిపడగల విన్యాసాలు
ఇవేమి నాకు కానరావడం లేదు...
నా కళ్ళలో ,కలలలో
ఒక్క నా చెలి తప్ప
ఇంకేమీ లేదు.


-(1998)
posted by dpbandi at 11:45 AM 0 comments

కళ్ళతోటె నీవు ...

కళ్ళతోటె నీవు
కథలు చెప్పావు,
చిరునవ్వు నవ్వి
నా మనసు దోచావు.




-(వరంగల్లు 1998)
posted by dpbandi at 10:09 AM 0 comments